/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
దేశంలోకి మరో డేంజరస్ వైరస్ ఎంట్రీ ఇచ్చింది. బ్రెయిన్ ఈటింగ్ వైరస్ మరోసారి కేరళను భయపెడుతోంది. తాజాగా తిరువనంతపురంలో 17 ఏళ్ల బాలుడికి పాజిటివ్ వచ్చినట్లు పరీక్షల్లో తేలింది. అక్కులం టూరిస్ట్ విలేజ్ పూల్‌లో ఆ బాలుడు ఈత కొట్టాడు. దీనివల్ల బ్రెయిన్ ఈటింగ్ వైరస్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ నీటిని పరీక్షల కోసం అధికారులు పంపారు. అయితే ఈ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ వల్ల ఇప్పటికే 18 మంది మృతి చెందారు. కేవలం కేరళలో వీటిపై 67 కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చూడండి: IRCTC: రైలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారా ?.. త్వరలో మారనున్న రూల్స్
Kerala brain-eating amoeba alert!
— IndiaToday (@IndiaToday) September 15, 2025
Watch as @Sonal_MK explains what the brain-eating amoeba is, how it attacks the brain, how it infects humans, and more.#5Livepic.twitter.com/2Rcjc9C2al
అతి ప్రాణాంతకమైన వ్యాధి..
ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా మెదడును తింటుంది. ఇది ఎక్కువగా కేరళ రాష్ట్రంలో వస్తుంది. ఇది నెగ్లేరియా ఫోలేరి అనే సూక్ష్మజీవి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకితే జీవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దేశంలో ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఇది ఒకటి. అయితే అమీబా మన చుట్టూ ఉన్న వెచ్చని, నిలకడగా ఉన్న మంచి నీటిలో నివసిస్తుంది. చెరువులు, నదులు, సరస్సులు, కాలువలు, సరిగ్గా శుభ్రం చేయని స్విమ్మింగ్ పూల్స్‌లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ అమీబా నీటిని తాగడం ద్వారా మనుషులకు సోకదు. ఎవరైనా కలుషితమైన నీటిలో స్నానం చేసినప్పుడు లేదా ఈత కొట్టినప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఇది నేరుగా మెదడుకు చేరుకుని, అక్కడ తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను సృష్టిస్తుంది. ఇది మెదడు కణాలను తినడం ప్రారంభిస్తుంది. అందుకే దీనిని "మెదడును తినే అమీబా" అని పిలుస్తారు.
#Kerala#India
— Dr. Subhash (@Subhash_LiveS) September 15, 2025
Faces outbreak of a fatal brain infection caused by #Amoeba. This, thrives in stagnant or fresh water bodies.
Infection is fatal with no known treatment
Avoid submerging your head in water while swimming, use nose clips, clear stagnant water, chlorinate them. pic.twitter.com/MyqjOq26dp
వ్యాధి సోకిన కొన్ని రోజులలోనే లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. మొదట తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి సాధారణంగా ఫ్లూ జ్వరానికి సంబంధించినవి కావడంతో చాలామంది వీటిని తేలికగా తీసుకుంటారు. వ్యాధి ముదిరితే మెడ బిగుసుకుపోవడం, మూర్ఛ రావడం, మాట పడిపోవడం, చివరికి కోమాలోకి వెళ్లిపోవడం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. దీంతో ఈ వ్యాధి బారిన పడిన వారిలో 97% మంది చనిపోయే ప్రమాదం ఉంది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: ఉత్తరాఖండ్లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్.. మునిగిన డెహ్రాడూన్