BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా 21 మంది మృతి!

కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కకమెగా రోడ్డులో బస్సు బోల్తా పడటంతో స్పాట్‌లోనే 21 మంది మృతి చెందారు. మృతుల్లో 10 మంది పురుషులు, పది మహిళలు ఒక బాలిక కూడా ఉంది. అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

New Update
Kenya accident

Kenya accident

ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. యాక్సిడెంట్ జరిగితే కనురెప్ప పాటులోనే ఘోరం జరిగిపోతుంది. రోజులో ఎన్నో ఇలాంటి ఘటనలు డైలీ వింటుంటాం. అయితే తాజాగా కెన్యాలోనూ ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కెన్యాలోని కకమెగా రోడ్డులో బస్సు బోల్తా పడటంతో స్పాట్‌లోనే 21 మంది మృతి చెందారు. మృతుల్లో 10 మంది పురుషులు, పది మహిళలు ఒక బాలిక కూడా ఉంది. అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి:BIG BREAKING: చైనాలో ఆకస్మిక వరదలు.. కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి!

ఇది కూడా చూడండి: Kakinada: బోడి గుండుపై జుట్టు పెంచుతామంటూ.. కాకినాడలో కలకలం రేపుతున్న మరో కొత్త మోసం!

ఆకస్మిక వరదల వల్ల చైనాలో..

ఇదిలా ఉండగా ఇటీవల చైనాలో వాయువ్య గన్సు ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపుగా 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపుగా 33 మంది గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. అలాగే గ్వాంగ్జౌలోని దయువాన్ గ్రామంలో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు మరణించారు. దీనివల్ల ఇళ్లు అన్ని కూడా వీటి కింద శిథిలం అయ్యాయి. మరో 48 గంటల పాటు చైనాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కుండపోత వర్షాలు యుజోంగ్ కౌంటీని అతలాకుతలం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్, ఫోన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు