BREAKING: అత్యాచారం కేసులో రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామి అరెస్ట్‌

కర్నాటకకు చెందిన రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామిను పోలీసుల అరెస్టు చేశారు. బెళగావిలో 17 ఏళ్ల బాలికను లాడ్జిలో రెండు రోజుల పాటు అత్యాచారం చేసి మహాలింగపుర బస్టాండ్‌లో బాలికను వదిలేశాడు. దీంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.

New Update
Karnataka case

కర్నాటకకు చెందిన రామలింగ మఠాధిపతి లోకేశ్వర స్వామిని పోలీసుల అరెస్టు చేశారు. బెళగావిలో 17 ఏళ్ల బాలికపై స్వామీజీ అత్యాచారం చేశాడు. దీంతో పోలీసులు లోకేశ్వర స్వామిపై పోక్సో యాక్ట్ కింద పోలీసులు అరెస్టు చేశారు. మే 13వ తేదీన బాలిక ఇంటికి వెళ్తుంటే కారులో తీసుకెళ్లాడు. సైలెంట్‌గా ఉండకుండా గొడవ చేస్తే చంపేస్తామనని బెదిరించి.. బాగల్‌కోట్, రాయచూర్‌ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మే 16వ తేదీన బాగల్‌కోట్ జిల్లాలోని మహాలింగ్‌పూర్ నగరంలోని బస్టాండ్ వద్ద వదిలిపెట్టాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. 

ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

వైద్య విద్యార్థినిపై..

ఇదిలా ఉండగా ఇటీవల కర్ణాటకలోని బెలగావికి చెందిన అమ్మాయిపై కొందరు దుండగులు సాముహిక అత్యాచారం చేశారు. సాంగ్లి జిల్లాలో ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయి తన క్లాస్ మేట్స్ తో కలిసి నైట్ షో సినిమాకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంది. అయితే ఇదే అదనుగా భావించిన ఆమె స్నేహితులు ముందు ఆ అమ్మాయి చేత మందు తాగించారు. అందులో ఆమెకు తెలియకుండా డ్రగ్స్ కూడా కలిపారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.

ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

ఆ తరువాత విద్యార్థినిపై ఒకరి తర్వాత ఒకరు ముగ్గురూ అత్యాచారం చేశారు. స్పృహలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించింది. స్నేహితులను ముగ్గురినీ ప్రశ్నించింది.  దీంతో ముగ్గురు నిందితులూ విద్యార్థినిపై బెదిరింపులకు దిగారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. 

ఇది కూడా చూడండి: Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

అయితే ఆ అమ్మాయి మాత్రం తనకు జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు విశ్రాంగ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కింద సామూహిక అత్యాచారం, ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. దీంతో పూణె, షోలాపూర్, సాంగ్లికి చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.  న్యాయస్థానం ముగ్గురు విద్యార్థులకు మ 27వరకు కస్టడీ విధించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు