కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం .. 6మంది స్పాట్ డెడ్

కర్ణాటక విజయపుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈరోజు ఉదయం నేషనల్ హైవే NH-50 పై మణగూళి పట్టణం సమీపంలో యాక్సిడెంట్ జరిగింది.

New Update
Karnataka road accident

Karnataka road accident

కర్ణాటక విజయపుర జిల్లాలో జరిగిన ఘోర  రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈరోజు ఉదయం నేషనల్ హైవే NH-50 పై మణగూళి పట్టణం సమీపంలో ఈ  యాక్సిడెంట్ జరిగింది. 

6మంది స్పాట్  డెడ్ 

ప్రాథమిక సమాచారం ప్రకారం,  సోలాపూర్ వైపుగా  వెళ్తున్న కారు..  రోడ్ మధ్యలోని డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు ప్రయాణికులతో పాటు   బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు.  ఈ ప్రమాదంలో ఇంకొంత మంది ప్రయాణికులు గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మణగూళి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

telugu-news | cinema-news | crime | road-accident | karnataka | karnataka latest news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు