వాంతికి రావడంతో బస్సులో నుంచి తల బయటకు.. కట్ చేస్తే రోడ్డుపై తల, చేయి!
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శివలింగమ్మ (58) అనే మహిళ బస్సులో వెళ్తుండగా వాంతి చేసుకునేందుకు కిటికీలో నుంచి తల బయటపెట్టింది. అయితే అదే సమయంలో అటుగా వస్తున్న టిప్పర్ లారీ బస్సును రాసుకుంటూ దూసుకెళ్లడంతో.. ఆమె తల తెగి రోడ్డుపై పడింది.