/rtv/media/media_files/2025/10/27/jiu-jitsu-player-rohini-kalam-passed-away-by-suicide-2025-10-27-19-56-24.jpg)
jiu jitsu player rohini kalam passed away by suicide
ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం (35) సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆమె 2022 ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దేవాస్‌లోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఒత్తిడి వల్లే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తన సోదరి రోష్మి చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఇన్‌స్టాలో ఆర్మీ ఆఫీసర్‌లా బిల్డప్ కొట్టి.. డాక్టర్‌ని రేప్ చేసిన డెలివరీ ఏజెంట్
పోలీసులకు రోష్మి పలు కీలక విషయాలు చెప్పింది. '' రోహిణి అష్టాలో ఓ ప్రైవేట్ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ కోచ్‌గా పనిచేస్తోంది. శనివారం దేవాస్‌లో ఇంటికి వచ్చింది. ఆమె ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిడిలో ఉన్నట్లు నాకు అనుమానం వచ్చింది. ఆదివారం ఉదయం టిఫిన్ తీసుకొని ఫోన్ మాట్లాడుతూ తన రూమ్‌కు వెళ్లింది. ఫోన్‌లోనే పాఠశాల అధ్యాపకులు తనను ఇబ్బంది పెడుతున్నట్లు ఎవరితో చెప్పడం విన్నట్లు'' పేర్కొంది.
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన.. 12 రాష్టాల్లో SIR
రోహిణి తన క్రీడా ప్రయాణాన్ని 2007లో ప్రారంభించింది. 2015లో ప్రొఫెషనల్ జియుజిట్సు కెరీర్‌లోకి అడుగుపెట్టింది. హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. అంతేకాదు బర్మింగ్‌హోమ్‌లో జరిగే ప్రపంచ క్రీడలకు సెలక్ట్ అయిన ఏకైక భారతీయ అథ్లెట్‌గా కూడా ఆమె అరుదైన రికార్డును సాధించింది. థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ 2022లో 48 కిలోల విభాగంలో కాంస్యం సాధించింది. అలాగే అబుదాబిలో జరిగిన 8వ ఆసియా జియుజిట్సు ఛాంపియన్‌షిప్ 2024 డ్యూయో క్లాసిక్ ఈవెంట్‌లో మరో కాంస్య పథకం సాధించింది.
Also Read: పాకిస్థాన్ రాజకీయాల్లో ప్రకంపనలు.. షెహబజ్ షరీఫ్ VS అసిం మునీర్
Follow Us