/rtv/media/media_files/2025/04/07/JlqRzRo7vi5TJ54ZZDyu.jpg)
Jaipur Gangrape
కాంగ్రెస్ నాయకురాలిపై కార్యకర్తలపై సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన జైపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జైపూర్‌లోని ఓ మహిళ కాంగ్రెస్ కార్యకర్తకు పౌర ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్ ఇప్పిస్తానని చెప్పి ముగ్గురు యువకులు కలిసి ఒక హోటల్‌కు తీసుకెళ్తారు.
ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో
కౌన్సిలర్ టికెట్ ఇప్పిస్తామని చెప్పి..
కౌన్సిలర్ టికెట్ కోసం ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కూడా కాల్ చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆ ఎమ్మెల్యే కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెకు మత్తుమందు ఇచ్చి సాముహిక అత్యాచారం చేశారు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!
ఇదిలా ఉండగా విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జరిగింది. చదువు చెప్పాల్సిన గురువే ఓ విద్యార్థిని పాలిట శాపం అయ్యాడు. నైతిక విలువలు నేర్పించాల్సిన గురువు మైమరిచి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని భవానీపురం జోజినగర్‌కు చెందిన పుల్లేటికుర్తి భువనచంద్ర (31) తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ స్కూల్‌లో చదువుతున్న ఓ పదో తరగతి బాలిక స్పెషల్ క్లాస్‌కు వెళ్లింది. ఈ సమయంలో ఉపాధ్యాయుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్
దీంతో బాలిక భయపడి.. స్కూలు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఈ జరిమానాలో రూ.10 వేలు, నష్టపరిహారం కింద రూ.3 లక్షలు బాధితురాలికి అందజేయాలని డిస్ట్రిక్ట్ లీగల్‌సెల్ అథారిటీని న్యాయమూర్తి ఆదేశించారు.