/rtv/media/media_files/2025/04/10/gqizyOSCWOIuQRTiCSC8.jpg)
Hyderabad train accident brothers died
Crime: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యాకుత్‌పురా- ఉప్పుగూడ స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్న అన్నదమ్ములు మహ్మద్ సాహెబుద్దీన్ (26), ఫైజాన్ (21)ను రైలు ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కుటుంబం గుండెలవిసేలా రోధిస్తోంది.
కనురెప్పపాటులో ఘోరం..
ఈ మేరకు రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ సాహెబుద్దీన్ (26), ఫైజాన్ (21) సోమవారం యాకుత్‌పురా- ఉప్పుగూడ స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్నారు. అయితే అదే సమయంలో అటువైపుగా వచ్చిన రైలు వారిని ఢీ కొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడిక్కడే చనిపోయారు. సాహెబుద్దీన్ ఎలక్ట్రిక్ పనులు చేస్తుండగా ఫైజాన్ వెల్డింగ్ పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవారు. ఇద్దరు కొడుకులు ఒకేసారి మరణించడంతో కుటుంబం గుండెలు పగిలేలా రోధిస్తోందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
hyderabad | railway | accident | telugu-news | today telugu news
Follow Us