BIG BREAKING: నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులోని పేషెంట్స్!

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది, పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు. వార్డుల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద వివరాలు తెలియాల్సివుంది. 

New Update
nims fire

NIMS Hospital fire accident

Nims: హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది, పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు. వార్డుల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద వివరాలు తెలియాల్సివుంది. 

ఐదోవ అంతస్తులో.. 

అయితే ఐదొవ అంతస్థులో మంటలు చెలరేగినట్లు తెలుస్తుండగా ప్రాణనష్టంపై ఏమీ జరగనట్లు సమాచారం. కానీ ఎమర్జెన్సీ వార్డు కావడంతో పేషెంట్స్ ప్రాణభయంతో ఉక్కిరిబిక్కిరయ్యారని, పేషెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అప్రమ‌త్తమైన నిమ్స్ సిబ్బంది పోలీసుల‌కు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థలానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.  అయితే మంటలు అంటుకున్న 5వ అంతస్తులో రోగులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఆస్తినష్టం గురించి ఇంకా అంచనా వేయాల్సి ఉందని, లిఫ్ట్ పక్కన ఉన్న ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నాయని గుర్తించారు. వార్డులు కాకుండా అక్కడ ఆడిటోరియం ఉండడంతో రోగులకు ఎలాంటి సమస్య తలెత్తలేదని వైద్యులు తెలిపారు. 

ire accident | nims-hospital | hyderabad | telugu-news | today telugu news fire accident 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు