Hyderabad: బైక్ పార్క్ చేసి.. మూసీలోకి దూకిన యువకుడు.. చివరకు ఏమైందంటే?

హైదరాబాద్‌లోని మూసీ నదిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి దూకాడు. ఎక్కువ రద్దీగా ఉండే ఛాదర్ ఘాట్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి బైక్‌ను ఫుట్‌పాత్‌పై పార్క్ చేసి దూకాడు. వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో యువకుడు దూకిన కొన్ని క్షణాల్లో నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయాడు.

New Update
crime news

crime news

ఆత్మహత్య చేసుకోవడానికి ఓ యువకుడు హైదరాబాద్‌లోని మూసీ నదిలోకి దూకాడు. ఎక్కువ రద్దీగా ఉండే ఛాదర్ ఘాట్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి బైక్‌ను ఫుట్‌పాత్‌పై పార్క్ చేశాడు. ఆ తర్వాత వెంటనే నదిలోకి దూకేశాడు. గమనించిన కొందరు అక్కడికి వెళ్లేలోగా ఆ యువకుడు కొట్టుకుని పోయాడు. వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో ఆ యువకుడు దూకిన కొన్ని క్షణాల్లోనే నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయాడు. దీంతో అక్కడనున్న వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఇది కూడా చూడండి: Dead body in Drum : బ్లూడ్రమ్‌లో భర్త డెడ్ బాడీ.. భార్యాపిల్లలు మిస్సింగ్..

గాలింపు చర్యలు చేపట్టినా పోలీసులు..

ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల గాలింపు చర్యలకు వారికి ఇబ్బంది అవుతోంది. అయితే ఆత్మహత్యకు ప్రయత్నించాడా? లేకపోతే ఇంకా ఏదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్క్ చేసిన బైక్ నంబర్ ఆధారంగా కిరణ్ గౌడ్ అనే యువకుడు అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Ward Boy Sexual harassment : వీడసలు మనిషేనా?.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులు

అప్పు తీసుకున్నందుకు మాటలు..

ఇదిలా ఉండగా ఇటీవల ఓ మహిళ వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 2016లో దుర్గాఘాట్‌లో వడ్డీ వ్యాపారం చేసే దుక్క వేణు, దుక్క శ్రీనివాస్‌ అనే అన్నదమ్ముల దగ్గర తన భర్త కృష్ణతేజ రూ.50 వేలు అప్పుగా తీసుకున్నారని కృష్ణప్రియ తెలిపారు. దీనికి ఖాళీ చెక్కు, ప్రామిసరీ నోటుపై సంతకాలు పెట్టించి వారు తీసుకెళ్లారని ప్రస్తావించారు. 2017లో అప్పులో రూ.15 వేల వరకు చెల్లించారు. అయినా కూడా వడ్డీ కట్టలేదని గతంలో తన భర్త లేనప్పుడు వీరు ముగ్గురు వచ్చి కూడా గొడవ చేసినట్లు కృష్ణప్రియ తెలిపారు. 

భర్త లేని సమయంలో వేధింపులకు గురి చేసిన వడ్డీ వ్యాపారులు..

వారి వేధింపులు తట్టుకోలేక ఒకసారి తన భర్త తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారట. కానీ మళ్లీ తన భర్త లేనప్పుడు వారు వేధింపులకు పాల్పడటంతో ఆ మాటలు భరించలేక కృష్ణప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. తన చావుకు ఆ ముగ్గురు వడ్డీ వ్యాపారులే కారణమని లేఖలో పేర్కొంది. ‘బుజ్జి నన్ను క్షమించు అని లేఖలో రాసింది. అయితే తన శవాన్ని తన భర్తకే అప్పగించాలని, తమకు న్యాయం చేయాలని హోంమంత్రి అనిత, పోలీసులను కోరింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు లోన్ యాప్‌ల్లో డబ్బులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత సరిగ్గా కట్టలేకపోతే వారు వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ లోన్ యాప్‌ల వల్ల చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా పెరిగిపోయాయి. 

Advertisment
తాజా కథనాలు