BIG BREAKING: మియాపూర్‌లో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మృతి!

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృత్యువాత పడ్డారు. నంద్యాలకు చెందిన ఓ వ్యక్తికి భార్యతో గొడవ జరిగింది. మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. ఇంకో వ్యక్తి యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. వీటిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
V BREAKING

BIG BREAKING

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృత్యువాత పడ్డారు. భార్యతో వివాదం జరగడంతో ఒకరు సూసైడ్ చేసుకోగా మరొకరు యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాలకు చెందన నరసింహారెడ్డి మియాపూర్ పరిధిలో ఉంటున్నాడు. భార్యతో వివాదం జరగడంతో మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక చందానగర్‌లో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బైక్ నడుపుతున్నప్పుడు అదుపు తప్పి మరో బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 

లిఫ్ట్‌ పడటంతో..

ఇదిలా ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా విషాదం చోటుచేసుకుంది. 17వ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం దుర్మారణం చెందారు. ప్రమాదవశాత్తు లిప్టులో పడి ఆయన మృతి చెందినట్లుగా స్థానికులు వెల్లడించారు.  సిరిసిల్ల పట్టణం వెంకట్రావునగర్ లో సోమవారం రాత్రి సిరిసిల్ల డిఎస్పీని పరామర్శించి లిప్టులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మూడో ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా ఒకటో ఫ్లోర్ ఉన్న లిఫ్ట్‌పై గంగారం పడిపోయాడు.

ఇది కూడా చూడండి:Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!

ఈ ఘటనలో తీవ్రంగా  గాయపడిన గంగారాంను రాత్రి ఫైర్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.  అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లుగా వైద్యులు నిర్థారించారు.  గంగారాంకి భార్య రేఖ, కొడుకు సతీష్ కుమార్ ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు.  నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగారం సిరిసిల్ల 17వ బెటాలియన్ కమాండెంట్ గా బాధ్యతలు చేపట్టి  కేవలం మూడు నెలలు మాత్రమే అవుతుంది. ఆయన మృతి పట్ల పోలీసులు సంతాపం తెలిపారు.  

ఇది కూడా చూడండి:Elan Musk: ఎక్స్‌ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్‌ దాడే అంటున్న మస్క్‌!

Advertisment
తాజా కథనాలు