Crime: దారుణం.. భార్య ప్రైవేట్ వీడియో లీక్ చేసిన భర్త

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్య ప్రైవేటు వీడియోను లీక్ చేయడం కలకలం రేపింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్తను అదుపులోకి తీసుకున్నారు.

New Update
Husband arrested in Rewa for allegedly circulating wife's private video

Husband arrested in Rewa for allegedly circulating wife's private video

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్య ప్రైవేటు వీడియోను లీక్ చేయడం కలకలం రేపింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇకవ వివరాల్లోకి వెళ్తే.. రేవా జిల్లాలోని 2025 మే 10న ఓ మహిళకు శివ సాహూతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.3 లక్షల కట్నం డిమాండ్ చేయగా వధువు కుటుంబం రూ.2 లక్షలు ఇచ్చింది. 

Also Read: విద్యార్థులకు అడోబ్‌ గుడ్‌న్యూస్‌.. ఈ సాఫ్ట్‌వేర్స్‌ ఉచితం

మిగతా డబ్బు కోసం   భర్త, అతడి కుటుంబ సభ్యులు ఆమెను వేధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో భార్య ప్రైవేట్ వీడియోను భర్త రికార్డు చేశాడు. సోషల్ మీడియాతో పాటు అతడి బంధువులకు కూడా ఈ వీడియోను షేర్ చేశాడు. చివరికి ఈ విషయం గురించి భార్యకు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త ఇంటి నుంచి ముంబైకి పారిపోయాడు.  

Also Read: ఎఫ్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం.. బ్రిటన్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్టు..

ఆ తర్వాత ఫిబ్రవరి 12న శివం సాహూ అత్తమామల ఇంటికి వచ్చి ఆయుధంతో వాళ్లను బెదిరించాడు. దీంతో వాళ్లు కూడా ఇతడిపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వరకట్న వేధింపులు, క్రిమినల్ బెదిరింపులు, ప్రైవేట్ కంటెంట్‌ను షేర్ చేయడం లాంటి సెక్షన్ కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు