/rtv/media/media_files/2025/09/29/haryana-2025-09-29-09-59-16.jpg)
Haryana: హర్యానాలోని పానిపట్‌లో దారుణం జరిగింది. హోంవర్క్ చేయనందుకు రెండవ తరగతి విద్యార్థిని తాడుతో తలకిందులుగా కిటికీకి వేలాడదీసి కొట్టిన ఘటన కలకలం రేపుతోంది. పాఠశాల ప్రిన్సిపల్ ముందే చిన్న పిల్లలను సైతం దారుణంగా చెంపదెబ్బలు కొట్టిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ దారుణాలన్నీ ప్రిన్సిపల్ డ్రైవర్ చేయడంతో ఇష్యూ పెద్దదైంది.
తాళ్లతో కట్టి, కిటికీ నుంచి..
ఈ మేరకు ముఖిజా కాలనీకి చెందిన 7 ఏళ్ల బాలుడు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. అయితే తాను ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేసుకుని రాలేదని పాఠశాల ప్రిన్సిపల్ మందలించాడు. అతనికి పనిష్మెంట్ ఇవ్వాలని తన డ్రైవర్ అజయ్‌కి సూచించారు. దీంతో ఆ బాలుడిని శిక్షించడంలో అజయ్ పరిమితులను దాటాడు. విద్యార్థిని పై అంతస్తులోని గదికి తీసుకెళ్లి, తాళ్లతో కట్టి, కిటికీ నుండి తలకిందులుగా వేలాడదీశాడు. చెంపదెబ్బలు కొట్టాడు. అయితే ఇదంతా తన స్నేహితులకు వీడియో కాల్ చేసి బాలుడు వివరించడంతో తల్లిదండ్రులు వెంటనే స్కూల్ కు వెళ్లి ఆరాతీయగా బాగోతం మొత్తం బయటపడింది.
ఇది కూడా చూడండి: Arattai app: వాట్సాప్‌కు పోటీగా ఇండియా యాప్.. సేమ్ టూ సేమ్
టాయిలెట్లను శుభ్రం చేయించడం..
దీనిపై స్పందించిన ప్రిన్సిపల్ రీనా.. తాను కొట్టిన విద్యార్థులు ఇతరులతో దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. 'పిల్లలను సరైన మార్గంలోకి తీసుకురావడానికి నేను ఈ చర్య తీసుకున్నా. అలా చేయడానికి ముందు వారి కుటుంబాలకు తెలియజేశాం'అని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే బహిరంగంగా పిల్లలను చెంపదెబ్బ కొట్టడం విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధం. శిక్షగా కొంతమంది విద్యార్థులను బలవంతంగా టాయిలెట్లను శుభ్రం చేయించారని కూడా ఆరోపణలు ఉన్నాయని బాలుడి పేరెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వారం రోజుల పాటు వర్షాలే వర్షాలు
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఈ వ్యవహారం మొత్తం పోలీస్ స్టేషన్ కు చేరడంతో వేగంగా చర్యలు తీసుకున్నారు. పోలీసులు డ్రైవర్ అజయ్‌పై జువెనైల్ జస్టిస్ చట్టంలోని తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జస్టిస్ యాక్ట్, 2015లోని సెక్షన్ 115, 127(2), 351(2) 75 కింద కేసులు ఫైల్ చేసినట్లు తెలిపారు.