/rtv/media/media_files/2025/05/21/5bqor5EOw4cvfacF7O8C.jpg)
18ఏళ్ల యువతి డెడ్‌బాడీ సూట్‌కేస్‌లో కుక్కి ట్రైన్‌లో నుంచి బయటకు విసిరారు. దక్షిణ బెంగళూరులోని రైల్వే పట్టాల సమీపంలో ఒక సూట్‌కేస్ దొరికింది. రైల్వే పోలీసులకు అందిన సమాచారంతో అక్కడికెళ్లి సూట్‌కేస్ ఓపెన్ చేయగా.. అందులో ఓ యువతి మృతదేహం ఉంది. హోసూర్ ప్రధాన రహదారికి సమీపంలోని పాత చందాపుర రైల్వే వంతెన సమీపంలోని రైల్వే పట్టాల పక్కన ఈ సూట్‌కేస్ కనిపించింది. రన్నింగ్ ట్రైన్ నుంచి లగ్యేజ్ బ్యాగ్ కిందకి పడేవేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also read: Amith sha: చరిత్రలో తొలి విజయం.. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన పోస్ట్!
Bengaluru Suitcase Horror
— THESingh (@IamVishnu_Singh) May 21, 2025
18 year old girls body found in suitcase in Anekal, Bengaluru.
Bengaluru is going to rots under Congress regime.
Trust @RahulGandhi will take a stock of it and question the law and order situation of Karnataka under @siddaramaiah and @DKShivakumar ! pic.twitter.com/fobUsA3KZE
Also read: Turkey: పాకిస్తాన్‌కి బాంబులు, ఇండియాకేమో స్వీట్లు.. టర్కీ తీరుపై చర్చ
పోలీసులు కేసు ఫైల్ చేసి చనిపోయిన యువతి వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం మృతదేహాన్ని సూట్‌కేస్‌లో వేరే చోట ఉంచి, తరువాత కదులుతున్న రైలు నుండి విసిరివేసినట్లు తెలుస్తోంది. సూర్యనగర్ పోలీసులు కేసు స్టడీ చేసి బైయప్పనహళ్లి రైల్వే పోలీసులకు బాధ్యతలు అప్పగించారు. మృతురాలి ఐడి లేదా వస్తువులు అందులో ఏమీ లేనందున ఆమె ఎవరో ఇంకా కనిపెట్టలేకపోయామని బెంగుళూర్ రూరల్ ఎస్సీ అన్నారు. యువతి సమాచారం కోసం కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతకొన్ని వారంరోజుల క్రితం మే12 కర్ణాటకలోని రామనగరలో రైల్వే పట్టాల సమీపంలో 14 ఏళ్ల గిరిజన బాలిక మృతదేహం కనిపించింది. ఆమె చెవిటి, మూగ. ఆ కేసు కూడా విచారణ కొనసాగుతుంది.
bangalore | Suitcase Incident | Dead Body In Bag | crime news | latest-telugu-news