రూ.6 వేల కోట్ల భారీ కుంభకోణం.. UCO బ్యాంక్ డైరెక్టర్ అరెస్టు

భారీ కుంభకోణం కేసులో UCO బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ గోయల్‌‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రూ.6210.72 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వడ్డీ లేకుండా CSPLకి రుణం ఇచ్చినందుకు ఈడీ అధికారులు అరెస్టు చేశారు. 

New Update
UCO Bank

UCO Bank

UCO బ్యాంక్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ గోయల్‌‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. రూ.6210.72 కోట్ల భారీ కుంభకోణంలో గోయెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. యూకో బ్యాంక్‌తో సహా పలు బ్యాంకులు కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు ఇచ్చిన రుణంలో భారీ మోసం, అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. వడ్డీ లేకుండా దాదాపుగా రూ.6210.72 కోట్లు రుణం ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో అరెస్టు చేశారు. 

ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!

ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!

భారీగా రుణ అవకాశాలు ఇవ్వడంతో..

సుబోధ్ కుమార్ గోయల్ పదవిలో ఉన్నప్పుడు UCO బ్యాంక్ ద్వారా CSPLకి భారీగా రుణ అవకాశాలు కల్పించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. గోయల్‌కు చట్టవిరుద్ధంగా నగదు, ఖరీదైన ఆస్తులు, విలాసవంతమైన వస్తువులు, హోటల్ బుకింగ్‌లు వంటి సౌకర్యాలు లభించాయి. గోయల్‌పై ఈ ఏడాది దాడి జరిగింది. 

ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం

ఈ సమయంలో అక్రమ లావాదేవీలు, పత్రాలకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో ఇదే కేసులో CSPL ప్రమోటర్ సంజయ్ సురేకకు చెందిన రూ.510 కోట్ల విలువైన ఆస్తులను ED అటాచ్ చేసింది. సంజయ్ సురేకను 2024లో అరెస్టు చేయగా.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఇది కూడా చూడండి: Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్‌ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు