BIG BREAKING: మాజీ డీజీపీని దారుణ హత్య చేసిన భార్య..!

బెంగుళూర్‌లో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ ఆదివారం ఆయన నివాసంలో దారుణ హత్యకు గురైయ్యారు. 2015 నుంచి 2017 మధ్యకాలంలో ఓం ప్రకాశ్ కర్ణాటక డీజీపీగా పని చేశారు. ఆయన భార్యే అతన్ని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
Former DGP Om Prakash

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ ఆయన నివాసంలో ఆదివారం దారుణంగా హత్యకు గురైయ్యారు. 2015 నుంచి 2017 మధ్యకాలంలో ఓం ప్రకాశ్ ఆ రాష్ట్ర డీజీపీగా పని చేశారు. ఆయన భార్యనే అతన్ని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగుళూర్‌ హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లోని ఆయన ఇంట్లో ఆదివారం (ఈరోజు) మధ్యాహ్నం హత్య జరిగినట్లు తెలుస్తోంది. అతడి ఒంటిపై పలు చోట్ల కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. 
ప్రస్తుతం ఓం ప్రకాష్ భార్య పల్లవి పోలీసుల అదుపులో ఉన్నారు.

Also read: బిట్టూ నువ్ సూపర్ రా..  క్రికెట్‌పై ఇష్టం రూ.3900 కోట్ల ఆస్తిని కాపాడింది..!

ఓం ప్రకాశ్ మర్డర్ గురించి పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఓం ప్రకాష్‌ స్వస్థలం బిహార్‌లోని చంపారన్. ఆయన 1981 కర్ణాటక బ్యాచ్ ఐపీఎస్ కేడర్‌ ఆఫీసర్. ఓం ప్రకాష్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆయనకు పెద్ద ఎత్తున అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also read: Husband: బ్యూటీపార్లర్‌కు భార్య, పాపిష్టి మొగుడు.. పాపం బోడిగుండు భార్య

ఆర్థిక సమస్యలు కుటుంబకలహాలకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఆర్థిక విషయాలే ఈ హత్యకు కారణమా.. లేక మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓం ప్రకాష్ తన ఆస్తిని భార్యకు కాకుండా నేరుగా కొడుకుకు బదిలీ చేశారని, దీంతోనే ఆమె కోపంతో ఈ హత్య చేసిఉండొచ్చని వాదనలు వినిపిస్తున్నాయి.

Also read: wife harassment: మరో భార్యా బాధితుడు బలి.. ‘నా అస్తికలను డ్రైనేజీలో కలపండి’

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు