బతికే అర్హత లేదు..నా కూతుర్ని ఉరి తీయండి :  ముస్కాన్ తల్లిదండ్రులు

ముస్కాన్ ను ఆమె తల్లిదండ్రులు అసహ్యించుకుంటున్నారు.  ఆమె తండ్రి మాట్లాడుతూ.. తన బిడ్డ క్షమించారని తప్పు చేసింది. సాహిల్ మాయలో పడి సౌరభ్ ను చంపేసింది.  ఇంత దారుణానికి పాల్పడిన ఆమెకు ఉరే సరి. సౌరభ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు.

New Update
meerut

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్‌లో జరిగిన హత్య  కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లవర్ తో కలిసి భర్తను చంపి అతని డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి.. శరీర భాగాలను సిమెంట్ తో నింపిన ప్లాస్టిక్ డ్రమ్ లో కప్పి పెట్టింది ఓ భార్య. అయితే నిందితురాలు ముస్కాన్ ను ఆమె తల్లిదండ్రులు అసహ్యించుకుంటున్నారు.  ఆమె తండ్రి ప్రమోద్ రస్తోగి  మాట్లాడుతూ.. తన బిడ్డ క్షమించారని తప్పు చేసింది. సాహిల్ మాయలో పడి సౌరభ్ ను చంపేసింది.  ఇంత దారుణానికి పాల్పడిన ఆమెకు ఉరే సరి. ఈ విషయంలో సౌరభ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు.

Also read :  ఏంటీ నిజమా.. మహాత్మ హీరోయిన్ విడాకులు తీసుకుంటుందా?

అందుకే అతన్ని చంపేశా

సౌరభ్ తనను డ్రగ్స్ తీసుకోనివ్వడని తన కూతురు తనతో చెప్పిందని, అందుకే అతన్ని చంపేశానని తెలిపిందన్నారు.  డ్రగ్స్ లేకుండా తాను జీవించలేనని ఆమె నాకు చెప్పింది. నిందితురాలి తల్లి కవితా రస్తోగి మాట్లాడుతూ తన కుమార్తె మార్చి 17న తనకు ఫోన్ చేసి సౌరభ్ తో గొడవ పడ్డానని చెప్పిందని..  ఏమి జరిగిందని అడిగినప్పుడు, సౌరభ్‌ను అతని కుటుంబ సభ్యులు కత్తితో పొడిచి చంపారని ముస్కాన్ చెప్పిందన్నారు.  పోలీస్ స్టేషన్ కు కెళ్లి ఈ విషయం గురించి ఫిర్యాదు చేయాలని అనుకున్నప్పుడు మార్గమధ్యలో  తన ప్రేమికుడు సాహిల్ తో కలిసి సౌరభ్ ను హత్య చేసినట్లు ఒప్పుకుందన్నారు.

ముస్కాన్ తండ్రి  చెప్పిన వివరాల ప్రకారం సాహిల్ ఆమెతో 8వ తరగతి వరకు చదువుకున్నాడు.  2019లో సోషల్ మీడియా ద్వారా ఆమెతో తిరిగి పరిచయం ఏర్పడింది.  సౌరభ్ రెండేళ్ల క్రితం లండన్ వెళ్ళినప్పుడు, ఆమె డ్రగ్స్‌కు బానిసైందని..  సాహిల్ ఆమెను వాటిని తీసుకోవడానికి బలవంతం చేశాడని తెలిపారు.  

Also Read :  రెండేళ్లుగా ముట్టుకోనివ్వట్లేదు సార్.. భార్యపై పోలీసులకు భర్త ఫిర్యాదు!

Also read :  అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు