అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

సరూర్‌నగర్‌ లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో ఇరువైపులు వాదనలు పూర్తి అయ్యాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. మార్చి 21వ తేదీకి తీర్పును వాయిదా వేసింది కోర్టు.

New Update
apsara murder

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో ఇరువైపులు వాదనలు పూర్తి అయ్యాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. వాస్తవానికి ఇవ్వాళే తీర్పు వెలువరించాల్సి ఉంది కానీ టెక్నికల్ సమస్యల వలన మార్చి 21వ తేదీకి తీర్పును వాయిదా వేసింది కోర్టు.

Also Read :  రెండేళ్లుగా ముట్టుకోనివ్వట్లేదు సార్.. భార్యపై పోలీసులకు భర్త ఫిర్యాదు!

అప్సరతో పరిచయం, వివాహేతర సంబంధం

సరూర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పూజారి సాయికృష్ణకు అప్సరతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త  వివాహేతర సంబంధానికి దారి తీసింది. సాయికృష్ణకు ఇప్పటికే పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని సాయికృష్ణను అప్సర ఒత్తిడి చేయడంతో సహనం కోల్పోయిన సాయి ..  గోవాకు వెళ్దామని అప్సరను నమ్మించి కారులో తీసుకెళ్లాడు.శంషాబాద్‌లోని సుల్తాన్‌పల్లికి  వెళ్లాక అప్సరను అక్కడే చంపేసి అదే కారులో తీసుకొచ్చి సరూర్‌నగర్‌ లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద మ్యాన్‌హోల్‌లో పడేశాడు.

Also Read : లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది

సీసీటీవీ ఫుటెజ్ ఆధారంగా

అనంతరం తనకు ఏమీ తెలియదన్నట్లుగా అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటెజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించి సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అప్సర గర్భం దాల్చింది అందుకు తానే కారణమని పెళ్ళిచేసుకోవాలని ఒత్తిడి చేసిందని సాయికృష్ణ విచారణలో వెల్లడించాడు. కానీ ఆమె వేరేవాళ్లతో కూడా సన్నిహితంగా ఉండేదని ఇవన్నీ భరించలేకే హత్య చేశానని తెలిపాడు. అప్సర మొదటిసారి గర్భవతి అయినప్పుడు సాయికృష్ణ అబార్షన్ చేయించాడు...అయితే రెండోసారి కూడా గర్భం దాల్చిడంపై సాయికృష్ణకు అనుమానం నెలకొందని..  గర్భం పైనే వివాదం జరిగినట్లుగా సాయికృష్ణ వెల్లడించాడు.  

Also Read :  ఏంటీ నిజమా.. మహాత్మ హీరోయిన్ విడాకులు తీసుకుంటుందా?

Also read :  సొంత బ్యానర్ లో మెగా డాటర్ మరో మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు