Elephant Attack: ఎనుగుల దాడి.. ఇద్దరు మృతి
జార్ఖండ్‌లోని ఈస్ట్ సింగ్భుమ్ జిల్లాలో రెండు వేరు వేరు ఏనుగుల దాడి ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. చౌతియా గ్రామంలో ఉన్న ఓ వ్యక్తిని ఏనుగు తొక్కి చంపగా.. డిఘీ గ్రామంలో మరో ఏనుగు ఓ ఇంటిపై దాడి చేసింది. ఇంటి గోడ కూలడంతో లోపల నిద్రిస్తున్న ఓ వృద్ధురాలు మృతి చెందింది.
Telangana: కొమురం భీం జిల్లాలో ఏనుగు భీభత్సం..ఇద్దరు రైతులు మృతి
ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలో ఓ ఏనుగు భీభత్సం సృష్టిస్తోంది. నిన్న ఒక రైతు మీద, ఇవాళ ఒక రైతు మీద దాడి చేసి చంపేసింది. పొలాల్లో పనులు చేసుకుంటున్న వారి మీద అటాక్ చేస్తోంది ఏనుగు.
Another Woman Killed in Elephant Attack: చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి..!
చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి మదపుటేనుగు దాడిలో మరో మహిళ మృతి చెందింది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు బోడి నత్తం గ్రామానికి చెందిన మహిళ వసంత(57) అనే మహిళ ఏనుగు దాడిలో మృతి చెందింది. గురువారం తెల్లవారు జామున వసంత అనే మహిళపై దాడి చేసి చంపేసింది. శ్రీరంగం పల్లి చెరువు నుంచి కుంకి ఏనుగుల ద్వారా అటవీ ప్రాంతంలోకి అధికారులు మళ్లీస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏనుగు వరుసగా దాడి చేస్తూండటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Couple killed at Elephant Attack: బీభత్సం సృష్టించిన ఏనుగు.. దంపతులు మృతి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం రోజు రోజుకూ ఎక్కువవుతుంది. ఏనుగుల గుంపు తరచూ పంటలపై దాడి చేస్తూనే ఉన్నాయి. దీంతో అక్కడి పల్లె జనాలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. అడ్డుకోవడానికి వచ్చిన వారిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. తాజాగా గుడిపాల మండలంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో భార్యభర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.