/rtv/media/media_files/2025/11/16/electrical-car-burnt-at-ntr-stadium-in-hyderabad-2025-11-16-17-13-15.jpg)
Electrical car burnt at NTR Stadium in hyderabad
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ కారు మొత్తం మంటల్లో దగ్ధమయ్యింది. మరోకారు కూడా పాక్షికంగా కాలిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటీనా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
#Hyderabad:
— NewsMeter (@NewsMeter_In) November 16, 2025
A sudden #fire broke out in an #electriccar (TS09 GD 1262) near #NTR Stadium.
Locals spotted #smoke and alerted officials.#Firefighters quickly reached the spot and doused the flames. #GandhiNagar & #Domalguda police managed the traffic.
Fortunately, no… pic.twitter.com/iTNbwzCFPw
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు భక్తులు మృతి
గాంధీనగర్, దోమలగూడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన చోట వాహనాల రాకపోకలను నియంత్రించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణంపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఢిల్లీ పేలుళ్లకు 18 గంటల ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడ ఉన్నాడంటే?
Follow Us