/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న టెంపోను ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. జోధ్‌పూర్-జెసల్మేర్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. సమాచారం మేరకు పోలీసలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. వీడియో వైరల్
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రామ్ దేవ్రా దేవాలయం దర్శనం కోసం కొందరు భక్తులు టెంపో వాహనంలో వెళ్తున్నారు. రోడ్డుపై వేగంగా వస్తున్న ఓ ట్రక్కు అదుపతప్పి భక్తులు ప్రయాణిస్తున్న టెంపో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన అనంతరం ట్రక్కు డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Follow Us