Drugs: డాక్టర్‌ ఇంట్లో డ్రగ్స్‌ పార్టీ.. వెలుగులోకి సంచలన విషయాలు!

హైదరాబాద్‌ చందానగర్‌ గుల్మొహర్‌లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీ నడపడం సంచలనం రేపుతోంది. పక్కా సమాచారంతో పోలీసులుదాడి చేసి రూ.18 లక్షల విలువైన 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా ఐదుగురు పరారీలో ఉన్నారు.

New Update
Drugs

Drugs: హైదరాబాద్‌ నగరంలో మరోసారి డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపింది. ఏకంగా డాక్టర్ ఇంట్లోనే పార్టీ నడపడం సంచలనం రేపుతోంది. ఈ మేరకు చందానగర్‌ గుల్మొహర్‌లోని డ్రగ్స్‌ పార్టీ జరుగుతుందనే సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున  పోలీసులు వైద్యుడి ఇంటిపై దాడి చేయగా..150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ పట్టుబడింది. దాని విలువ రూ.18 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. 

రాజస్థాన్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి..

అయితే ఈ డ్రగ్స్ రాజస్థాన్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామన్నారు. మరోవైపు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.ః

ఇది కూడా చదవండి: ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వకండి.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు

భారీగా నార్కోటిక్స్‌ డ్రగ్స్‌..

ఇదిలా ఉంటే.. నగరంలోని జీవీ సులూజా దవాఖానల్లో భారీగా నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 30న హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని పలు హాస్పిటళ్లలో ఎక్సైజ్‌, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మౌలాలీలోని నేహా భగవత్‌ ఇంట్లో సోదాలు నిర్వహించి నార్కోటిక్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇక సులూజా దవాఖానలో పెద్ద మొత్తంలో మత్తు మందును నిల్వచేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా వాటిని దిగుమతి చేసి హాస్పిటల్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన నేహా భగవత్‌ సహాయంతో మత్తుమందులు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: మరో వైసీపీ కీలక నేతపై లైంగిక ఆరోపణలు.. వాడుకుని వదిలేశాడంటూ

Advertisment
Advertisment
తాజా కథనాలు