మరో వైసీపీ కీలక నేతపై లైంగిక ఆరోపణలు.. వాడుకుని వదిలేశాడంటూ వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన దగ్గరే రూ.90 లక్షలు కాజేసి ఇప్పుడు మొహం చాటేశాడంటూ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. By srinivas 01 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Merugu Nagarjuna: ఏపీ వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ విజయవాడకు చెందిన ఓ మహిళా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. ఈ మేరకు తనకు డిపార్ట్ మెంట్ ఉద్యోగం లేకపోతే కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తానని నాగార్జున తనను మోసం చేశాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది కూడా చదవండి: మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్ పై హార్దిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నన్ను నమ్ము అంటూ.. ‘నీకు అండగా ఉంటా. నన్ను నమ్ము అంటూ నమ్మించి నాగార్జున లైంగికంగా వాడుకున్నాడు’ అంటూ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు తన వద్ద రూ.90 లక్షలు క్యాష్ పీఏ ద్వారా తీసుకున్నాడని, పీఏకు ఫోన్ చేస్తే స్పందించట్లేదని ఆమె ఆరోపించింది. ఇక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే #merugu-nagarjuna #ys-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి