Dharmasthala Mass Burial Case: 450 మంది మహిళలు అదృశ్యం.. లెక్కలేనన్నీ శవాలు.. ధర్మస్థల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

కర్ణాటక ధర్మస్థల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ తవ్వకాలు జరపగా ఎముకలు, పుర్రెలు లభించాయి. అయితే గత పదేళ్లలో దాదాపుగా 450 మంది మహిళలు అనుమానస్పదంగా కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.

New Update
Dharmasthala Mass Burial Case

Dharmasthala Mass Burial Case

కర్ణాటకలో నేత్రానది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మ స్థల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ధర్మస్థలంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎందరో అమ్మాయిలను తానే ఖననం చేసినట్లు తెలిపాడు. దీంతో సిట్ దర్యాప్తు చేపట్టింది. ధర్మస్థల అటవీ ప్రాంతంలోని శ్మశాన వాటికలోని పాయింటర్ నంబర్ 1 దగ్గర తవ్వకాలు జరపగా పుర్రెలు, ఎముకలు కనిపించాయి. ఇవి మహిళలు అయి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత పదేళ్ల సమయంలో ఈ ప్రాంతంలో దాదాపుగా 450 మంది మహిళలు కనిపించకుండా పోయారు. అయితే వీటిపై ఎలాంటి కేసు నమోదు, దర్యాప్తు కూడా లేదు. ఎక్కువగా పేద తరగతికి చెందిన యువతలు ఉన్నారని తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Dharmasthala: ధర్మస్థలలో కీలక పరిణామం.. బయటపడిన అవశేషాలు

అనుమానాస్పదంగా మిస్ అయిన విద్యార్థులు

సిట్ మొత్తం 13 చోట్ల తవ్వకాలు జరుపుతోంది. అయితే అటవీ ప్రాంతం కావడంతో పాటు తీవ్రంగా వర్షాలు కురుస్తుండటం వల్ల తవ్వకాలకు కాస్త ఇబ్బంది ఏర్పడుతోంది. ఆ ఆలయం చుట్టూ వైద్య కళాశాలలు, విద్య సంస్థలు ఇలా ఎన్నో ఏర్పడ్డాయి. ఈ కాలేజీలకి సంబంధించిన విద్యార్థులు ఎందరో అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. 2014లో ఓ విద్యార్థిని ఇక్కడ హత్యాచారానికి గురి కాగా.. ఎలాంటి దర్యాప్తు చేయలేదు. సిట్ మొదటి 13 ప్రాంతాల్లో సుమారుగా 15 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టింది. కానీ మొదట ఎలాంటి అస్థిపంజర అవశేషాలు లభించలేదు. దీంతో తవ్వకాలు ఆపేయాలని నిర్ణయించలేదు. ఈసారి పాయింట్ 2 దగ్గర తవ్వకాలు చేపట్టాలని సిట్ భావించింది. ఇంతలోనే తవ్వకాలలో ఎముకలు, పుర్రెలు లభ్యమయ్యాయి. తవ్వకాలు జరిపే సమయంలో ప్రతీ ఒక్క దాన్ని కూడా రికార్డింగ్ చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Dharmasthala case : ధర్మస్థల శవాల వెనుక అంతుచిక్కని మిస్టరీలు.. వెలుగులోకి సంచలన విషయాలు!

పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడంతో..

కర్ణాటకలోని ధర్మస్థల వివాదం ఇప్పుడు కాదు.. 2012లో వెలుగులోకి వచ్చింది. కానీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సౌజన్య అనే 17 ఏళ్ల విద్యార్థిని 2012లో దారుణంగా హత్య చేశారు. ఆమె మృతదేహం కూడా ఈ పుణ్యక్షేత్రం సమీపంలోనే లభ్యమైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడు అని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి నిందితుడు కాదని కోర్టు తీర్పు ఇవ్వడంతో.. నిర్దోషిగా విడుదల చేశారు. అయితే ఆ యువతి కుటుంబం మాత్రం న్యాయం కోసం ఎదురు చూసింది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అధికారులు ఎవరూ కూడా సీరియస్‌గా తీసుకోలేదు. నిందితులకు ఎలాగైన శిక్ష పడాలని సౌజన్య కుటుంబం ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. ఈ ఏడాది జులైలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 1995-2014 వరకు అక్కడ వర్క్ చేసిన పారిశుద్ధ్య కార్మికుడు హత్యల గురించి ఆ లేఖలో పేర్కొన్నాడు. పారిశుద్ధ్య కార్మికుడిగా చేస్తున్న సమయంలో ఎన్నో వందల మృతదేహాలను తానే ఖననం చేసినట్లు తెలిపాడు. దీంతో సిట్ ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. ఎలాగైనా ఈ కేసులో పూర్తి వివరాలను బయటకు తీయాలని తవ్వకాలు చేపట్టింది.

Advertisment
తాజా కథనాలు