BIG BREAKING: మరోసారి ఢిల్లీలో బాంబు బెదిరింపులు

మరోసారి ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. విద్యాసంస్థలు, కోర్టులను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

New Update
BREAKING

BREAKING

మరోసారి ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. విద్యాసంస్థలు, కోర్టులను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. పాటియాలా హౌస్‌తో పాటు సాకేత్ కోర్టు, రెండు సీఆర్పీఎఫ్ స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చూడండి: DK Shivakumar : ఆ ప్రశ్న జ్యోతిష్యుడిని అడగండి..  డీకే శివకుమార్ ఫైర్!

బెదిరింపులు కొత్తేం కాదు..

ఇదిలా ఉండగా ఇటీవల ఎర్రకోట వద్ద బాంబు బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 13 మంది మృతి చెందారు. ఇంతలోనే బాంబు బెదిరింపులు రావడంతో అధికారులతో పాటు ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. అయినా ఢిల్లీలో బాంబు బెదిరింపులు కొత్తేం కాదు. గతంలో పలు స్కూళ్లు, విమానాలకు కూడా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. 

ఇది కూడా చూడండి: Madvi Hidma : ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతం.. ఎందుకు పోలీసులకు మోస్ట్ వాంటెడ్ ?

Advertisment
తాజా కథనాలు