మరోసారి ఢిల్లీ స్కూళ్లకు.. వారంలో రెండోసారి బాంబు బెదిరింపులు

వారంలోనే రెండోసారి ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూల్ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

New Update
delhi schools

దేశ రాజధాని ఢిల్లీలోని స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. పశ్చిమ విహార్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూళ్లకు ఈ రోజు తెల్లవారు జామున బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య దళంతో పాఠశాలల దగ్గరకు చేరుకుని తనిఖీలు చేపట్టారు.

ఇది కూడా చూడండి: Japan: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఎక్కడనుంచి వచ్చాయని..

మొత్తం తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అందరూ కూడా రిలాక్స్ అయ్యారు. అయితే ఈ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు పంపారనే? అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

 ఇది కూడా చూడండి: Hyderabad: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!

ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఇదేం మొదటిసారి కాదు. ఈ వారంలోనే రెండోసారి బెదిరింపులు వచ్చాయి. డిసెంబర్ 9న మొత్తం 40 స్కూళ్లను పేల్చేస్తామంటూ బెదిరించారు. పేలుడు పదార్థాలు స్కూళ్లలో పెట్టామని.. 30 వేల డాలర్లు ఇవ్వకపోతే వాటిని పేల్చేస్తామన్నారు. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి.. తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

ఇది కూడా చూడండి: TN: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి

ఇది కూడా చూడండి: Allu Arjun: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు