ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌లోని ఢిల్లీ హైవేపై ఉన్న చెక్ పోస్ట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. డెహ్రాడూన్‌లో సేల్స్ టాక్స్ దగ్గర చెకింగ్ కోసం వాహనాన్ని ఆపమని అధికారులు డ్రైవర్‌ను సూచించారు. దీంతో డ్రైవర్ ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేయడంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. దీంతో కంటైనర్ ట్రక్ కింద పడటంతో మిగతా వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఇది కూడా చూడండి: SA:గనిలో చిక్కుకున్న 4 వేల మంది చిన్నారులు..సాయం చేయనంటున్న ప్రభుత్వం!
ఒకరు మృతి, తీవ్రంగా గాయాలు..
ఈ ప్రమాద ఘటనలో సుఖ్‌దేవ్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. తన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చూడండి: అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త క్లైమేట్ ఫైనాన్స్..
ఇంకో యాక్సిడెంట్ కూడా డెహ్రాడూన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు విద్యార్థులు అక్కడిక్కడే మరణించగా.. ఒకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు ఓవర్ టేక్ చేస్తూ.. ట్రక్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చూడండి: Nita Ambani: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్
ఇది కూడా చూడండి: Caste Census: కులగణనతో సంక్షేమ పథకాలు తొలగించం–రేవంత్ రెడ్డి