అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త క్లైమేట్ ఫైనాన్స్.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ ఫైనాన్స్ అవసరం ఉందని ఇండిపెండెంట్ హై లెవల్ ఎక్స్ పర్ట్ గ్రూప్.. చెప్పింది. పారిస్ ఒప్పందం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించడం ఎంత అవసరమో గుర్తుచేసింది. By Manogna alamuru 15 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Independent High Level Expert Group: ఇండిపెండెంట్ హైలె వల్ ఎక్స్ పర్ట్ గ్రూప్..క్లైమేట్ ఫైనాన్స్ మీద కొత్త నివేదికను రిలీజ్ చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ ఫైనాన్స్ అవసరాన్ని గుర్తు చేసింది. వారి COP28 నివేదికలో, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల దృష్ట్యా..భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎంత డబ్బులు అవసరం అవుతాయో అంచనా వేసింది. COP28 నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో 2030 నాటికి ప్రతి ఏడాది సుమారు US$2.4 ట్రిలియన్ అవసరమని చెప్పింది. ముఖ్యంగా ఎనర్జీ ట్రాన్సిషన్, దానికి సరిపడే మార్పులు, స్థిరత్వం, నష్టం,హాని నివారణ, ఇంకా పరిరక్షణ వంటి కీలక రంగాలకు ఈ నిధులు అవసరమని హైలేట్ చేశారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో ప్రైవేట్ రంగం, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు, దాతలు, ఫైనాన్స్ సంస్థల మధ్య మధ్య సమన్వయం చాలా అవసరం అని ఇండిపెండెంట్ హైలెవెల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ నివేదించింది. దీని కోసం లక్ష్యపూర్వక దృక్పథం అవలంబించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక ప్రతిపాదించింది. సరైన, అందరికీ అందుబాటులో ఉండే విధంగా క్లైమేట్ ఫైనాన్స్ ఫ్రేమ్‌వర్క్ కోసం పబ్లిక్ , ప్రైవేట్ ఫైనాన్స్‌ను బలోపేతం చేయడం, దేశీయ వనరులను వినియోగించడం, 2030 నాటికి సబ్సిడీ వడ్డీ రేట్లు కలిగిన ఫైనాన్స్‌ను మూడింతలు చేయడం ఇంకా డెవలపింగ్ బ్యాంకుల పాత్రను మరింత బలోపేతం చేయడం అవసరమని చెప్పింది. ఇండిపెండెంట్ హైలెవెల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ నివేదికలో ఎం.డి.బి. వ్యవస్థలోని ప్రతి అంశాన్ని ఒక సమగ్రమైన విధానంగా ఉపయోగించాలనే అవసరాన్ని పునరుద్ఘాటిస్తూ, పెట్టుబడులకు అనుకూలమైన ప్రాజెక్ట్‌లను రూపొందించడంలో క్లైమేట్ ఫైనాన్స్‌ను విస్తరించడానికి ప్రాజెక్ట్ తయారీ విధానాలను మార్చడానికి అవసరం ఉందని చెప్పింది. Also Read: Reliance: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్ #national-news #climate Finance #IHLEG #cop28 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి