/rtv/media/media_files/2025/04/11/rbGelioeIYd5kFyolFvo.jpg)
Karnataka incident
Crime News: అక్రమ సంబంధం పెట్టుకొని.. ఆ తర్వాత ఆమెను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. తీరా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో అసలు నిజం బట్టబయలు అయ్యింది. దీంతో పోలీసులు అతడిపై కేసు పెట్టి జైలుకు పంపారు. ఈ ఘటన కర్ణాటక జిల్లా చిత్రంగిరిలో చోటుచేసుకుంది.
Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో
నాటకం ఆడిన యువకుడు
అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెళ్లకెర మండలం ఓబయ్యనహట్టి గ్రామానికి చెందిన లోహిత్ అనే యువకుడు మంగళవారం ఓ యువతిని తీసుకొని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్ళాడు. గూనూరు జాతీయ రహదారిపై స్పృహ తప్పిపడిపోయిందని.. ఆమెను చికిత్స కోసం తెచ్చానని వైద్యులకు మాయ మాటలు చెప్పాడు. అనంతరం ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి
హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా
దర్యాప్తులో మృతురాలిని మఠదకురుబరహట్టి నివాసి నేత్రావతిగా గుర్తించారు. అనంతరం ఆమె తల్లికి సమాచారం అందించారు. అయితే నేత్ర తల్లి తిప్పమ్మ.. లోహిత్ పై అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. తిప్పమ్మ ఫిర్యాదు మేరకు లోహిత్ ను పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. తానే నేత్రావతిని చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు నేత్రావతి, లోహిత్ ఫోన్లను పరిశీలించగా కొద్దిరోజులుగా వారిద్దరి మధ్య సంభాషణలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది.