/rtv/media/media_files/2025/06/12/2BSN1vGctouQbvobXSPy.jpg)
Chhatrapati Sambhajinagar's Siddharth Garden
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో బుధవారం సాయంత్రం ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా సిద్ధార్థ్ గార్డెన్ సమీపంలోని ప్రవేశ ద్వారం నిర్మాణంలో ఒక భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు గేటు దగ్గర నిలబడి ఉండగా.. నిర్మాణం అకస్మాత్తుగా కుప్పకూలడంతో వారు దాని కింద చిక్కుకున్నట్లు సమాచారం.
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
గోడ కూలి ముగ్గురు స్పాట్ డెడ్
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ జి. శ్రీకాంత్ మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక పరిహారం అందుతుందని చెప్పారు. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!
#WATCH | Maharashtra: Two people died near Siddharth Garden in Chhatrapati Sambhajinagar earlier this evening after a structure at the entry gate collapsed and fell on them, following strong winds. In a separate incident, one woman was injured after a tree uprooted and fell on… pic.twitter.com/qqCNdHPaOh
— ANI (@ANI) June 11, 2025
ఈ ఘటనపై సంబంధిత అధికారులపై కేసు నమోదు చేస్తామని అన్నారు. ఈ నిర్మాణం మాత్రమే కాకుండా.. నగరం చుట్టుపక్కల ఉన్న అన్ని పాత నిర్మాణాలను రాబోయే ఏడు రోజుల్లో ప్రత్యేక ఆడిట్ ద్వారా తనిఖీ చేస్తామని తెలిపారు. దాని ఫలితాల ఆధారంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు ప్రవేశం కొనసాగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం
#WATCH | Police Commissioner Pravin Pawar says, "Once any officer of the Municipal Corporation gives a complaint regarding the Siddharth Garden incident, we will register an offence and take further action against people concerned." https://t.co/rRo2CinlSI pic.twitter.com/TowYRB1oyZ
— ANI (@ANI) June 11, 2025
మరోవైపు ఈ ఘటనపై ఛత్రపతి శంభాజీనగర్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ పవార్ స్పందించారు. మున్సిపల్ అధికారులు అధికారిక ఫిర్యాదు సమర్పించిన తర్వాత నేరం నమోదు చేస్తామని తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ నుండి అధికారిక ఫిర్యాదు కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అది దాఖలు అయిన తర్వాత.. కేసు నమోదు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని అన్నారు.
#BreakingNews: Two #fatalities reported in #ChhatrapatiSambhajinagar when strong winds caused a structure #collapse near Siddharth Garden, while a woman was injured in Bhagatsingh Nagar due to a fallen tree uprooted by winds.#Maharashtra #MaharashtraNews #Weather #WeatherUpdate pic.twitter.com/wndTTbCkK4
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) June 11, 2025
crime news | Latest crime news