Nellore Aruna arrest: నెల్లూర్‌లో లేడీ డాన్ అరుణ అరెస్ట్

నెల్లూరు సెంట్రల్ జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ మంజూరు చేయించడంలో చక్రం తిప్పిన అరుణను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

New Update

నెల్లూరు సెంట్రల్ జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ మంజూరు చేయించడంలో చక్రం తిప్పిన అరుణను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేస్తారని సమాచారం తెలుసుకున్న అరుణ కారులో హైదరాబాద్‌కు బయలు దేరింది. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన కారులో గంజాయి పెట్టి తప్పుడు కేసులు పెట్టే ప్రమాదం ఉందని.. అరుణ మీడియా బోరున ఏడ్చింది. ఆమెను కాపాడాలంటూ కారులో సెల్ఫీ వీడియో తీసి రిలీస్ చేసింది.

గతంలో కోవూరులోని ఓ ఇల్లు ధ్వంసం చేసిన ఘటనలో ఆమెపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆమెను ఏ కేసులో అరెస్ట్ చేశారో తెలియాల్సి ఉంది. అరుణను కోవూరు పోలీసు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు