రెచ్చిపోయిన దొంగలు... సినీఫక్కీలో భారీ చోరీ

బీహార్‌లో దొంగలు రెచ్చిపోయారు. సినీఫక్కీలో భారీ చోరీకి పాల్పడ్డారు.  ఆరాలోని తనిష్క్‌ జ్యూవెల్లర్స్‌లో దొంగల ముఠా సిబ్బందిని, కస్టమర్లను తుపాకీతో బెదిరించి మరీ  రూ.25 లక్షల విలువైన ఆభరణాలు, నగదును దోచుకున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డైంది.  

New Update
bihar chori

బీహార్‌లో దొంగలు రెచ్చిపోయారు. సినీఫక్కీలో భారీ చోరీకి పాల్పడ్డారు.  ఆరాలోని తనిష్క్‌ జ్యూవెల్లర్స్‌లో దొంగల ముఠా సిబ్బందిని, కస్టమర్లను తుపాకీతో బెదిరించి మరీ  రూ.25 లక్షల విలువైన ఆభరణాలు, నగదును దోచుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డైంది.  మార్చి 10వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు షోరూమ్ తెరిచిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ముఖాలకు ముసుగులు, హెల్మెట్లు ధరించిన ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు దుకాణంలోకి చొరబడ్డారు.

Also read :  చూసి నేర్చుకోండి.. విదేశాల్లో సంప్రదాయబద్ధంగా.. జడేజా భార్యపై ప్రశంసలు!

ఫోన్ చేసిన పోలీసులు రాలే

తనిష్క్ జ్యూవెల్లర్స్‌ సిబ్బందిని, కస్టమర్లను వరుస క్రమంలో నిలబెట్టి చేతులు పైకెత్తి ఉండమని హెచ్చరిస్తూ షోకేస్ బాక్సులలో ఉంచిన ఆభరణాలను బ్యాగులలో తీసుకెళ్లారు.  తనిష్క్ షోరూమ్ స్టోర్ మేనేజర్ కుమార్ మృత్యుంజయ్ మాట్లాడుతూ షాపు నుండి రూ.25 కోట్ల విలువైన ఆభరణాలు దొంగిలించబడ్డాయని చెప్పారు. ఇక షాపులో ఎంత నగదు దొంగిలించబడిందో నిర్ధారిస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఘటనపై వెంటనే తాము పోలీసులకు సమాచారం అందించామని అయినప్పటికీ సకాలంలో పోలీసులు ఇక్కడికి చేరుకోలేదని  తనిష్క్‌ జ్యూవెల్లర్స్‌ సిబ్బంది ఆరోపిస్తున్నారు.  

Also read :  కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌.. హాజరైన సీఎం రేవంత్‌

ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు 

తనిష్క్ షోరూమ్‌లో ఐదు నుంచి ఆరుగురు నేరస్థులు దోపిడీకి పాల్పడ్డారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నేరస్థులను గుర్తించి త్వరలో అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని భోజ్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన తెలిపారు. స్థానికంగా ఈ ఘటన కలకలం  సృష్టించింది. 

Also read :  తండ్రీ కొడుకులకు బలుపు తప్పా ఏముంది..రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Also read :  Indian Origin women:విహారయాత్రకు వెళ్లి.. కరేబియన్ దేశంలో భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు