/rtv/media/media_files/2025/08/17/rajasthan-lover-2025-08-17-11-05-02.jpg)
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ప్రియురాలి కోరిక మేరకు కట్టుకున్న భార్యను హత్య చేశాడో బీజేపీ నాయకుడు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అజ్మీర్‌లోని కిషన్‌గఢ్‌కు చెందిన బీజేపీ నాయకుడు రోహిత్ సైని (35) తన భార్య సంజు సైని (32)ను తన ప్రియురాలి సహాయంతో హత్య చేశాడు. నాలుగేళ్ల కుమార్తెతో విడాకులు తీసుకున్న రీతూ అనే 25 ఏళ్ల ఉపాధ్యాయురాలు, రోహిత్‌తో రెండేళ్లుగా వివాహేతర సంబంధంలో ఉంది. ఇది రోహిత్ కుటుంబ సభ్యులకు తెలిసింది. అయినప్పటికీ ఇద్దరూ రహస్యంగా కలుసుకోవడం కొనసాగించారు. దీంతో ప్రియురాలి ఒత్తిడి చేయడంతో కట్టుకున్న భార్యను చంపేశాడు.
राजस्थान के अजमेर में पत्नी की हत्या का सनसनीखेज मामला सामने आया है। पुलिस ने खुलासा किया है कि बीजेपी नेता रोहित सैनी ने अपनी पत्नी संजू को अपनी प्रेमिका रितु सैनी के कहने पर मार डाला!
— Kishor Joshi (@KishorJoshi02) August 16, 2025
📌 वारदात को पहले लूटपाट का रूप देने की कोशिश की गई थी, लेकिन पुलिस ने महज़ 24 घंटे में पूरी… pic.twitter.com/FLZg4cO5VJ
దోపిడీ దొంగల పనిగా
ముందుగా దీనిని ఓ దోపిడీ దొంగల పనిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు రోహిత్. గుర్తు తెలియని దొంగలు తన భార్యను గొంతు కోసి హత్య చేసి విలువైన వస్తువులతో పారిపోయారని రోహిత్ సైని ఫిర్యాదులో వెల్లడించాడు. అనుమానం వచ్చిన పోలీసులు రోహిత్ సైనిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టాడు. తన ప్రియురాలి ఒత్తిడి మేరకు తన భార్యను హత్య చేశానని అంగీకరించాడు. రీతూకు తన మధ్య భార్య అడ్డుగా ఉందని, ఆమె అడ్డు తొలిగించాలని రీతూ పదే పదే ఒత్తిడి చేసిందని లేకపోతే తనతో ఉండనని చెప్పడంతోనే సంజు సైనిని హత్య చేశానని నేరాన్ని అంగీకరించాడు.
రీతూతో మూడేళ్లుగా పరిచయం
కాగా రోహిత్, సంజు 2018 లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె హీనాల్ ఉంది. సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్‌లో పనిచేసే రోహిత్ కు రీతూతో మూడేళ్లుగా పరిచయం ఉంది. రీతూ ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. కిషన్‌గఢ్‌లోని శివాజీ నగర్‌లో నివాసముంటున్న శివప్రసాద్ కుమార్తె రీతు అని ఎస్పీ కుమార్ తెలిపారు. ఇక ఈ కేసులో రోహిత్, రీతూలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ హత్యలో మరెవరికైనా సంబంధం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.