పాఠశాలలోని వాటర్ ట్యాంక్ కూలిపోయి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అరుణాచల్ ప్రదేశ్‌లోని మోడల్ విలేజ్‌లో సెయింట్ అల్ఫాన్సా స్కూల్‌లో అనుకోకుండా వాటర్ ట్యాంకు కూలిపోయింది. దీంతో ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇది కూడా చూడండి: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం..
స్కూల్ ప్రాంగణంలోని విద్యార్థులు ఆడుకుంటున్నారు. ఈ సమయంలో వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో గోడ పడి విద్యార్థులు మరణించారు. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్, యాజమాన్యం, నలుగురు వార్డెన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల
ఇదిలా ఉండగా ఇటీవల అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువతి మరణించింది. తెనాలికి చెందిన నాగశ్రీవందన పరిమళ (26) గణేష్, రమాదేవి దంపతుల కుమార్తే. ఆమె ఎంఎస్ చేయడానికి 2022 డిసెంబర్‌లో అమెరికా వెళ్లారు. ఉన్నత చదువులు చదివి తమ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలనుకున్నారు. ఉన్నత ఉద్యోగంలో చేరాలనుకున్నారు. కానీ అంతలోపే మృత్యువు కాటేసింది.
ఇది కూడా చూడండి: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక!
అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో చదువుతున్న ఆమె శుక్రవారం రాత్రి తన కారులో ప్రయాణిస్తుండగా.. ఒక ట్రక్ ఆ కారును ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ యువతి మృతి చెందింది. ఆమె మృత దేహాన్ని తెనాలికి పంపించడానికి తానా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!