/rtv/media/media_files/2025/05/02/YUmQri4BEB0JwURi320M.jpg)
malayala actor Vishnu prasad died
Vishnu Prasad: మలయాళ బుల్లితెర, సినీ నటుడు విష్ణు ప్రసాద్ ఈరోజు ఉదయం కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్తను ఆయన కో యాక్టర్ కిషోర్ సత్య సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. విష్ణు ప్రసాద్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు.
''ప్రియమైన మిత్రులారా ఇది ఎంతో బాధాకరమైన విషయం. నటుడు విష్ణు ప్రసాద్ మరణించారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆయన అకాల మరణాన్ని తట్టుకునే శక్తి ఆ కుటుంబానికి ఉండాలని ప్రార్థిస్తున్నాను'' అంటూ పోస్ట్ పెట్టారు.
ఆపరేషన్ కి డబ్బులు లేక
అయితే నటుడు విష్ణు ప్రసాద్ గత కొద్దిరోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాలని సూచించారు. ఆపరేషన్ కి దాదాపు 30 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు మలయాళ టీవీ యాక్టర్స్ అసోసియేషన్ ద్వారా డబ్బులు సేకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పలువురు నటులను కూడా ఆర్ధిక సహాయం చేయాలని అభ్యర్థించారు.
అంతేకాదు ఆయన కూతుళ్లలో ఒకరు లివర్ డొనేట్ చేసేందుకు కూడా ముందుకు వచ్చారు. కానీ లాభం లేకపోయింది. ఆపరేషన్ కోసం డబ్బులు సేకరించే లోపే విష్ణు ప్రసాద్ పరిస్థితి విషమించి కన్నుమూశారు. విష్ణు ప్రసాద్ కి అభిరామి, అనామిక అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
టెలివిజన్ పై పాపులర్
విష్ణు ప్రసాద్ కాశీ, కైయేతుమ్ దూరత్, రన్‌వే, మాంబఝక్కలం, బెన్ జాన్సన్, లోకనాథన్ IAS , పాఠక , లయన్ వంటి అనేక మలయాళ, తమిళ చిత్రాలలో నటించారు. తన పాత్రలతో మలయాళ టెలివిజన్ పై మంచి గుర్తింపు పొందారు.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?