America Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు ముగ్గురు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు, మనవడు, కూతురు అత్త సునీత మృత్యువాత పడ్డారు.

New Update
America Road Accident

America Road Accident Photograph: (America Road Accident)

America Road Accident: అమెరికాలోని ఫ్లోరిడా(Florida)లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్(Shadnagar, Rangareddy District) నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూతురు అత్త సునీత (56) మృత్యువాత పడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లి గ్రామం అశోక సముద్రంలో మునిగిపోయింది.

ఇది కూడా చూడండి: Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌‌లోనూ ప్రమాదం..

ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం రోడ్డుపై వేగంగా వెళ్తు అదుపు తప్పడంతో మెట్రో పిల్లర్, డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిచారు.
కారు మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులోనే కారు నడిపి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. కృష్ణానగర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు