కన్నకొడుకుల గొంతు కోసిన కసాయి తండ్రి.. రెండేళ్ల పసిప్రాణం బలి
కన్నతండ్రే మైనర్ పిల్లల గొంతు కోసి చంపిన ఘోరమైన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కుటుంబ గొడవల్లో భాగంగా ఈ దాడిచేయగా రెండేళ్ల పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. ఐదేళ్ల అబ్బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నిందితుడు అదే కత్తితో గొంతు కోసుకుని ఆస్పత్రిలో చేరాడు.