Air Force: కాలేజీపై కుప్పకూలిన విమానం!

వరుస విమాన ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్‌ ఢాకాలో ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ విమానం కాలేజీపై కూలిపోయింది. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. అధికారుల వెంటనే కాలేజీ దగ్గరకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 

New Update
Military training jet crashed

వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్‌ ఢాకాలో ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ విమానం కాలేజీపై కూలిపోయింది. F-7 BGI జెట్ సోమవారం మధ్యాహ్నం 1:06 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మైల్‌స్టోన్ కళాశాల క్యాంపస్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 16 మంది విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరు ఉపాద్యాయులు, ఓ పైలట్ ఈ ప్రమాదంలో చనిపోయారు. పదుల సంఖ్యలో కాలేజీ విద్యార్థులు గాయపడ్డారు. అధికారుల వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని హాస్పిటల్‌కు తరలిస్తున్నారు.

Also Read :  ఎయిర్‌ ఇండియాకు గడ్డుకాలం.. రన్‌వేపై అదుపుతప్పిన మరో విమానం

Air Force Training Jet Crashed

Also Read :  జగన్ జైలుకు వెళ్లడం ఖాయం.. పవన్‌ కళ్యాణ్ సంచలనం

Also Read :  జగన్ జైలుకు వెళ్లడం ఖాయం.. పవన్‌ కళ్యాణ్ సంచలనం

అలాగే ఈరోజు(సోమవారం) ఉదయం ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి ముంబైకి వచ్చిన విమానం.. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అయ్యేటప్పుడు రన్‌వేపై అదుపుతప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల గుజరాత్ అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంలో 274 మంది మరణించిన విషాద ఘటన మరవక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. 

శనివారం మరో ఇండిగో విమానానికి మరో పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి నాగ్‌పూర్ వెళ్లిన విమానం ల్యాండింగ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో విమానం లోపల ఉన్న ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. 

అమెరికాకు చెందిన అలస్కా ఎయిర్‌లైన్స్‌లో ఆదివారం రాత్రి టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. దీంతో వందలాది విమానాలను అత్యవరసర ల్యాండ్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రి 8 గంటలకు తొలిసారిగా ఐటీ సిస్టమ్స్‌లో సమస్యలు తలెత్తాయి.

Also Read :  పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో కీలక ప్రకటన

flight | aeroplane crash causes | aeroplane crashes

Advertisment
Advertisment
తాజా కథనాలు