/rtv/media/media_files/2025/03/29/B6L7aCHjgeEvgjAlDGZl.jpg)
cm-revanth btech
Telangana: నాలుగేళ్ల బీటెక్(B.Tech) కోర్సులో 50 శాతం సబ్జెక్టులు పాసైనా వారికి ఓ సర్టిఫికెట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విధివిధానాలు రూపొందించేందుకు ఓ కమిటీని నియమించనుంది. ప్రస్తుతం బీటెక్ లో 160 క్రెడిట్లు (ఒక్కో సెమిస్టర్ కు 20) ఉంటాయి. కనీస మార్కులతోనైనా అన్ని సబ్జెక్టులు పాసైతే వారు 160 క్రెడిట్లు సాధించినట్లే. ఇందులో ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిలైనా బీటెక్ పట్టా రాదు. దీంతో విద్యార్థి నాలుగేళ్ల కాలం వృథా అయినట్లే అవుతుంది.
Also Read : ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
Also Read : KYC Deadline: రేషన్ కార్డులదారులకు గుడ్ న్యూస్..ఆ గడువు పొడిగింపు
సగం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తే
అయితే కొత్త విధానంతో సగం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తే విద్యార్థులకు సర్టిఫికెట్ వస్తుంది. అంటే వారు 80 క్రెడిట్లు పొందుతారు. దీనిపై త్వరలోనే విధివిధానాలను ఖరారు చేయనున్నారు. దీంతో వారు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా యూనివర్సిటీల్లో ఎగ్జామ్ ఫీజులు, ఒక ఏడాది నుంచి మరో ఏడాదికి ప్రమోట్ అయ్యేందుకు అవసరమైన క్రెడిట్లు రకరకాలుగా ఉండటంపై కూడా అధికారుల చర్చించనున్నారు.
Also Read : ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!