Hyderabad : పర్మిట్ రూమ్లో ప్లేస్ కోసం కొట్టుకున్నారు.. కడుపు కింద కొట్టడంతో..!

వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో ఉన్న  సిట్టింగ్ ప్లేస్ కోసం ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఒక విద్యార్థి ప్రాణం తీసింది. హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 5న ఈ దాడి జరగగా, గాయపడిన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

New Update
permit-room

permit-room

వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో ఉన్న  సిట్టింగ్ ప్లేస్ కోసం ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఒక విద్యార్థి ప్రాణం తీసింది. హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 5న ఈ దాడి జరగగా, గాయపడిన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం పరిధిలోని ఉషోదయ కాలనీకి చెందిన ధనుష్ గౌడ్(20) నెల కింద బీకామ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాడు. ఈ సందర్భంగా పార్టీ ఇచ్చేందుకు ఫ్రెండ్స్ చోటు, అభినవ్ గౌడ్ తో కలిసి కూకట్ పల్లిలోని దారువాలా వైన్ షాప్ కు  వెళ్లాడు. వీళ్లు మద్యం తాగుతుండగా, అక్కడకు వచ్చిన బ్లింకిట్ లో డెలివరీ బాయ్ గా పని చేసే కేశవ్ సిట్టింగ్ ప్లేస్ విషయంలో ధనుష్, అతని ఫ్రెండ్స్ తో  గొడవ పడ్డాడు.

Also read :   Shivalik Sharma : ఆటగాడే.. ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ పై రేప్ కేసు

Also Read :   Bull Riding Scooty: అలా ఎలా ఎక్కిందమ్మా.. స్కూటీ నడిపిన ఎద్దు (VIDEO) వైరల్

ధనుప్ పై  దాడి చేసి

వాగ్వాదం పెరగడంతో కేశవ్ ఆగ్రహంతో ధనుప్ పై  దాడి చేసి కడుపు కింద, టెస్టికల్స్ పై  గాయపరిచాడు. గాయాల తీవ్రత తెలియని ధనుష్ ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు కడుపు, కడుపు కింది భాగంలో నొప్పి వస్తుందని, ముందు రోజు జరిగిన ఘటన గురించి ధనుష్ తల్లికి చెప్పాడు. ఆమె నిమ్స్ ఆసు పత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైన్‌షాపులో సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేశవ్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Also Read :  Drinking Bet : రూ. 10 వేల పందెం... వాటర్ లేకుండా ఐదు ఫుల్ బాటిళ్లు..  పాపం భార్య గర్భవతి!

Advertisment
తాజా కథనాలు