TG Crime : లవర్ తో జంప్..15 నెలల కొడుకుని బస్టాండ్‌లో వదిలేసి!

నల్లగొండ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.  అమ్మతనానికే మచ్చతెచ్చేలా ఓ మహిళ వ్యవహరించింది.  ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం 15 నెలల కొడుకుని బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయింది.  

New Update
nalgonda

నల్లగొండ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అమ్మతనానికే మచ్చతెచ్చేలా ఓ మహిళ వ్యవహరించింది. ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం 15 నెలల కొడుకుని బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయింది. హైదరాబాద్‌కు చెందిన నవీనకు ఇన్‌స్టాలో నల్గొండ పాతబస్తీకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. నవీనకు గతంలోనే పెళ్లి కాగా , 15 నెలల బాబు కూడా ఉన్నాడు. కట్టుకున్న భర్తను, పిల్లాడిని వదిలేసి పారిపోయేందుకు నవీన పెద్ద ప్లాన్ వేసింది. 

Also read :  నిమిష ప్రియ విడుదలపై బిగ్ అప్డేట్.. కేఏ పాల్ సంచలన ప్రకటన!

బాబును వదిలేసి లవర్‌తో

నల్లగొండ RTC బస్టాండ్‌కు బాబుతో కలిసి వచ్చిన నవీన అక్కడ బాబును వదిలేసి లవర్‌తో వెళ్లిపోవాలనుకుంది. బాబును బస్టాండ్ లో ఓ చిప్స్ ప్యాకెట్ కొనిచ్చి కూర్చొబెట్టి్ అక్కడి నుంచి మెల్లిగా జారుకుని లవర్ తో బైకుపై వెళ్లిపోయింది.ఆ తర్వాత తల్లికోసం బస్టాండ్ అంతా వెతికాడు బాబు.  ఐతే పిల్లాడిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులుల పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఆమె బాబును వదిలేసి ప్రియుడితో బైక్ పై వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాలు గుర్తించిన పోలీసులు ఆమె భర్తకు సమాచారమిచ్చి బిడ్డను అతనికి అప్పగించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. 

Also read :  HHVM : అదిరిపోయే అప్ డేట్.. హరిహర వీరమల్లు టీమ్ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు