HHVM : అదిరిపోయే అప్ డేట్.. హరిహర వీరమల్లు టీమ్ సంచలన ప్రకటన

ప్రేక్షకులుకు మంచి వినోదాన్ని అందించేందుకు అన్ని థియేటర్లలోనూ అప్ డేట్ వర్షెన్ ను అందుబాటులోకి తెచ్చాం.. ధర్మ కోసం పోరాటం ఇంకా పెద్దదైంది అని ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 02నుంచి టికెట్ ధరలు తగ్గనున్నాయి.  

New Update
hhvm

వవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం హరి హర వీరమల్లు.  ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ  మూవీ తెరకెక్కింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.  ఐదేళ్లుగా రూపొందిన ఈ చిత్రం ఫైనల్ గా భారీ అంచనాల నడుమ 2025 జులై 24వతేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే సినిమాలోని VFX షాట్స్ విషయంలో అభిమానులు, ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చిత్ర యూనిట్ తాజాగా ఈ విషయంలో మార్పులు చేసింది. ప్రేక్షకులుకు మంచి వినోదాన్ని అందించేందుకు అన్ని థియేటర్లలోనూ అప్ డేట్ వర్షెన్ ను అందుబాటులోకి తెచ్చాం.. ధర్మ కోసం పోరాటం ఇంకా పెద్దదైంది అని ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 02నుంచి టికెట్ ధరలు తగ్గనున్నాయి.  ఈ చిత్రం హిందీ వెర్షన్ ఆగస్టు 1న విడుదల కానుంది.

ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన

ఇక సినిమా విషయానికి వస్తే..  'హరిహర వీరమల్లు' 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ. పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే యోధుడి పాత్రను పోషించారు. మొఘల్ పాలకుల చేతుల్లో బందీగా ఉన్న ఒక నగరాన్ని విముక్తి చేయడానికి, అణగారిన ప్రజలలో ఆశను నింపడానికి వీరమల్లు విలువైన కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడానికి ఒక సాహసోపేతమైన మిషన్‌ను చేపడతాడు. విడుదలైన మొదటి రోజు, సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని కొందరు ప్రశంసించగా, వీఎఫ్‌ఎక్స్ నాణ్యత, కథనం కొంత నిరాశపరిచిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. 

హరి హర వీరమల్లు గురువారం (జులై 24) భారీ వసూళ్లతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రీమియర్ షోలతో కలిపి (బుధవారం, జులై 23), జులై 27 నాటికి సినిమా మొత్తం రూ. 65.36 కోట్ల (కొన్ని నివేదికల ప్రకారం రూ. 64.75 కోట్లు) వసూళ్లను సాధించింది. శుక్రవారం (రెండవ రోజు) వసూళ్లు 76.98% పడిపోయి రూ. 8 కోట్లు మాత్రమే వచ్చాయి. శనివారం (మూడవ రోజు) కాస్త మెరుగుపడి రూ. 9.25 కోట్లు లేదా రూ. 9.86 కోట్లు వసూలు చేసింది. కాగా ఆంధ్రప్రదేశ్ లోని రాజానగరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో 9, 10, ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం జూలై 27న సినిమాకు ఉచిత ప్రదర్శనలు నిర్వహించారు.

Advertisment
తాజా కథనాలు