/rtv/media/media_files/2025/08/07/suicide-2025-08-07-12-07-39.jpg)
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో షమీం భాను అనే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లులోని సోఫియా స్ట్రీట్‌కు చెందిన పీర్‌బాషా కుమార్తె షమీమ్‌బానకు రాయచూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.
రేషన్‌కార్డులో మార్పులు, చేర్పుల కోసమని
అయితే షమీనాబాను మూడు ఏళ్ల కిందట రేషన్‌కార్డులో మార్పులు, చేర్పుల కోసమని గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయంలో పని చేసే వీఆర్వో మహమ్మద్‌వలిని కలిసింది. దీంతో అక్కడ వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. వీఆర్వో ముందుగా వివాహిత ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె 7 నెలల గర్భిణి కావడంతో దూరం పెడుతూ వచ్చాడు.
దీంతో ఆమె జులైలో పోలీస్ స్టేషన్‌లో వీఆర్వోపై ఫిర్యాదు చేసింది. ఆమె తన బంగారాన్ని తాకట్టు పెట్టాడని, ప్రసవం దగ్గర పడింది వైద్యం చేయించాలని వీర్వోను కోరగా బెదిరించడంతో మోసపోయానని భావించింది. ఫోన్ కూడా బ్లాక్ చేయడంతో మనస్తాపానికి గురైన షమీమ్ బుధవారం రాత్రి విషం మింగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యలు గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో అనంతపురానికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈక్రమంలో మార్గమధ్యంలోనే ఆమె మృతిచెందింది. తన కుమార్తె మృతికి వీఆర్వో మహమ్మద్‌వలి కారణమని ఆమె తండ్రి పీరాబాషా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : ఇండియా-పాక్ సీజ్‌ఫైర్ ట్రంప్ సుంకాలకు మధ్య లింక్?.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
అన్యమతస్థుడితో క్లోజ్ గా ఉందని
బీహార్‌లో దారుణం జరిగింది. వివాహిత సునీత (32) ఆమె ప్రియుడు షకీల్ (40)తో సన్నిహితంగా ఉండగా చూసిన గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. అన్యమతస్థుడితో క్లోజ్ గా ఉందని స్థానిక పంచాయతీ ఆదేశాల మేరకు ఆ ఇద్దరికీ గుండు గీయించి, ముఖాలకు నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు. కటిహార్ జిల్లా ఫల్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రియుడి భార్య పరుగున పోలీస్‌స్టేషనుకు వెళ్లి సాయం కోరింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ వివాహితులేనని వారికి పిల్లలు ఉన్నవారని, కొంతకాలంగా సంబంధంలో ఉన్నారని అన్నారు. దర్యాప్తు అనంతరం తగిన చర్య తీసుకొంటామని జిల్లా ఎస్పీ శిఖర్ చౌధరి వెల్లడించారు.