యువతిపై దాడి.. నిందితుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

విజయనగరం జిల్లా శివారం గ్రామంలో అఖిల అనే యువతిపై దాడి చేసిన  నిందితుడు ఆదినారాయణను (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు

New Update
a young women

a young women

విజయనగరం జిల్లా శివారం గ్రామంలో అఖిల అనే యువతిపై దాడి చేసిన  నిందితుడు ఆదినారాయణను (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. నిందితుడు దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అఖిల సోదరుడికి నిందితుడు ఆదినారాయణస్నేహితుడు. ఆమె కుటుంబ సభ్యులతోనూ ఆదినారాయణ సన్నిహితంగా ఉండేవాడు. 

Also read :  డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇద్దరి మధ్య వాగ్వాదం

అయితే ఇటీవల ఆమెకు అసభ్య సందేశాలు పంపడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయమై అతడిని యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. దీంతో కక్ష పెంచుకున్న ఆదినారాయణ అఖిలపై కత్తితో దాడికి దిగాడు.  శనివారం ఇంటి ముందు బాధితురాలు బట్టలు ఉతుకుతున్న టైమ్ లో   కత్తితో పొడిచి పరారయ్యాడు. యువతికి పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.  

Also Read :  దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

వెంటనే చుట్టు పక్కల వారు గమనించి 108కి ఫోన్‌ చేశారు. ఆమెను చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి రావడంతో  ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు