/rtv/media/media_files/2025/10/24/4-boys-missing-after-swimming-in-a-lake-in-thirupati-district-2025-10-24-21-03-09.jpg)
4 boys missing after swimming in a lake in thirupati district
తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. ఈతకెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. వీళ్లలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. వేదాంతపురంలో సీపీఆర్ విల్లాస్ వెనుకున్న స్వర్ణముఖి నదిలోకి శుక్రవారం సాయంత్రం ఏడుగురు యువకులు ఈతకోసమని వెళ్లారు.
ఈతకొట్టే క్రమంలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో యువకులు గల్లంతయ్యారు. వీళ్లలో ముగ్గురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో నదిలో గాలిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ వాళ్లను మణిరత్నం, కృష్ణ, విష్ణుగా గుర్తించారు. మిగతా వారి కోసం డ్రోన్ల సాయంతో కూడా గాలిస్తున్నారు.
Also Read: ఆ SI 4సార్లు రే*ప్ చేశాడు.. లేడీ డాక్టర్ చేతి మీద సూ*సైడ్ నోట్
Follow Us