Uttarakhand: నలుగురు కార్మికులు మృతి.. మరో నలుగురి కోసం గాలింపు

ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో సంభవించిన హిమపాతం నుంచి రెస్య్కూ టీం 51 మందిని రక్షించారు. శనివారం రోజు గుర్తించిన 17 మంది కార్మికుల్లో నలుగురు చనిపోయారు. మరో ఐదుగురు కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

New Update
Uttarakhand avalanche

Uttarakhand avalanche Photograph: (Uttarakhand avalanche)

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడ్డ ఘటనలో మూడవ రోజు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 55 మంది కార్మికులు మంచు కింద చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 51 మంది కార్మికులను రెస్య్కూ టీం రక్షించింది. అందులో నలుగురు చనిపోయింది. వారిని హాస్పిటల్‌కు పంపించారు. మిగిలిన ఐదుగురి ఆచూకీ కోసం తీవ్రంగా క్షమిస్తున్నారు. మంచు ఎక్కువగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారుతుంది. శిథిలాల నుంచి రక్షించిన వారిని హెలికాఫ్టర్‌లో స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తరలిస్తున్నారు.

Also Read:హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

ఉత్తరాఖండ్ ,బద్రీనాథ్ దారిలో ఆర్మీ కోసం ఓ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా  మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ పని చేస్తున్న కార్మికులు మంచుకొండల కింద చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు సైన్యంతో పాటు, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైయ్యాయి. అమిత్ షా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Also Read :  65 లక్షల అప్పు కోసం వరుస హత్యలు...కేరళ మర్డర్స్ మిస్టరీ

Advertisment