BREAKING: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్‌ మండలం మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.

New Update
ACCIDENT

ACCIDENT

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్‌ మండలం మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం  ఈ ఘటన జరిగింది. వాంకిడి మండలం బెండారం గ్రామానికి చెందిన జగన్‌ (27) అనే యువకుడు దీపావళి పండుగ సందర్భంగా తన సోదరి అనసూయ(32), ఆమె పిల్లలని బైక్‌పై ఇంటికి తీసుకొస్తున్నాడు. 

Also Read: దీపావళి పండగను క్రిస్మస్ లాగా చేసుకోండి.. అఖిలేష్ సంచలన కామెంట్స్!

ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగన్‌, అనసూయతో పాటు ఆమె కొడుకు ప్రక్షశీల్‌ ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో పాపకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ పాపను కాగజ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగంగా కారు నడిపిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.  

Also Read: ఇస్రోకు చంద్రయాన్‌-2 నుంచి కీలక సమాచారం.. చంద్రుడిపై సూర్యుడి ప్రభావం..!

Advertisment
తాజా కథనాలు