world cup 2023:చూసినోళ్ళకు చూసినంత...క్రికెట్ పండగ మొదలవుతోంది.
వన్డే వరల్డ్ కప్ కు అంతా సిద్ధమయింది. ఈరోజే క్రికెట్ పండగకు మొదటిరోజు. భారత్లో జరిగే ప్రపంచ సమరం ముంగిట్లోకి వచ్చేసింది. క్రికెట్ ఫ్యాన్స్ కు దాదాపు నెలన్నర రోజులు పండగే పండగ. పసందైన షాట్లు.. అదిరిపోయే సిక్స్ లు, బౌండరీ లైన్ దాటే బంతులు, అద్భుతమైన క్యాచ్ లు, క్లీన్ బౌల్డ్, డకౌట్ లు, సెంచరీలు...ఓహ్..ఇలా ఒకటేమిటి చూసినోళ్లకు చూసినంత, ఎంజాయ్ చేసేవాళ్ళకు కావల్సినంత సంబరం.