Prabhas: క్రేజీ అప్‌డేట్... సలార్ నుంచి పంద్రాగస్టు కానుక

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. శృతిహాసన్ హీరోయిన్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చేనెలలో థియేటర్లలోకి రానుంది. ఈ నెలాఖరుకు సినిమా ట్రయిలర్ రాబోతోంది. ఆ ట్రయిలర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు, అంతకంటే ముందు మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది యూనిట్.

New Update
Prabhas: క్రేజీ అప్‌డేట్... సలార్ నుంచి పంద్రాగస్టు కానుక

సలార్ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రెడీ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో మూడు రోజుల్లో, పంగ్రాగస్టు కానుకగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయబోతున్నారు. ఇలా ఊహించని విధంగా ట్రయిలర్ కంటే ముందు, సాంగ్ లాంచ్ అనే న్యూస్ బయటకు రావడంతో.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అయితే ఈ న్యూస్‌పై ఇంకా క్లారిటీ రాలేదు.

సినిమాలో మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లలో పృధ్వీరాజ్ లుక్‌ను ఇప్పటికే టీజర్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు లిరికల్ వీడియోతో హైప్ మరింత పెరిగింది.

స‌లార్‌లో ఇది మొదటి భాగం మాత్రమే. దీని పేరు ‘స‌లార్ 1: సీస్ ఫైర్‌’. ఇండియ‌న్ సినిమా స్క్రీన్‌పై ఇలాంటి సినిమా రాలేదనేంత గొప్ప‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం 14 భారీ సెట్స్ వేసి మ‌రీ చిత్రీక‌రించారు. సెప్టెంబ‌ర్ 28న తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచవ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతోంది సలార్.

Advertisment
తాజా కథనాలు