CPI Narayana: తెలంగాణ సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులని దారుణంగా మోసం చేశారని.. ఆయనకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అడిగితేనే మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు ఇచ్చామన్నారు. అయితే కలిసి పనిచేస్తామనే ప్రతిపాదన కాంగ్రెస్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు.
ఆర్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నారాయణ ఏం మాట్లాడారంటే..
✦ బండి సంజయ్‌ను మార్పించింది కేసీఆర్. BRS జోలికి పెద్దగా రాని కిషన్‌రెడ్డిని తెచ్చిపెట్టుకున్నారు.
✦ మునుగోడు బైపోల్‌లో బీజేపీని ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదనే BRSకు మద్దతు ఇచ్చాం.
✦ మాకు మేముగా సపోర్ట్ చేయలేదు.. BRS వాళ్లే వచ్చి అడిగారు.
✦ కేసీఆర్ అన్నం పెట్టకపోయినా.. కడుపునిండా మాటలు పెడుతారు.
✦ మునుగోడు బైపోల్ అయిన తర్వాత కేసీఆర్ కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.
✦ బీజేపీ, మోదీని తిట్టిన కేసీఆర్, కేటీఆర్.. లిక్కర్ స్కాంలో కవిత పేరురాగానే సరెండర్ అయ్యారు.
✦ బీజేపీకి అనుకూలమైన లైన్ తీసుకోగానే కేసీఆర్‌పై మాకు డౌట్ వచ్చింది.
✦ KCRతో కమ్యూనిస్టులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది.. ముందుగానే బయటపడాల్సింది.
✦ కలిసి పనిచేస్తామనే ప్రతిపాదన కాంగ్రెస్ నుంచే వచ్చింది.
✦ CPI, CPM చెరో ఐదు సీట్లు అడిగాం.. చర్చలు కొనసాగుతున్నాయి.
✦ కమ్యూనిస్టులు విడిపోవడం వల్లే BJP బలపడింది.
✦ కమ్యూనిస్టులు పోరాటాలు ఆపలేదు.. కానీ మాకు మీడియా మద్దతు లేదు.
✦ కామ్రేడ్లు అంటే కమ్మ, రెడ్లు అన్న విమర్శలు సరికాదు.. అన్ని వర్గాలకు ప్రాధాన్యం దక్కింది.
✦ బిగ్‌బాస్ అంటే బ్రోతల్ హౌస్.. ఇది మన సంస్కృతి కానే కాదు.. అందుకే పోరాటం చేశాను.
✦ కాని దాన్ని ఆపడం పోలీసులు, కోర్టులతో కాలేదు.. నా పోరాటం కొనసాగుతుంది.
✦ ధైర్యం ఉంటే బిగ్‌బాస్‌ను 24 గంటలు లైవ్‌లో పెట్టగలరా?
✦ పవన్‌ను పొలిటికల్ బ్రోకర్ అని విమర్శించింది నిజమే. పవన్ రాజకీయాల్లో నిలకడగా ఉండటం లేదు.
✦ మళ్లీ BRS అధికారంలోకి రాదు.. కాంగ్రెస్ వామపక్షాల కూటమిదే అధికారం.
✦ సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాజకీయం చేస్తోంది.
✦ సనాతన ధర్మం, హిందూధర్మం రెండూ వేర్వేరు..
✦ ఇండియా కూటమితో మోదీకి భయం మొదలైంది.. అందుకే పేరు మారుస్తామని అంటున్నారు.
ఇది కూడా చదవండి:Telangana Congress on CPI Seats..! సీపీఐకి ఇచ్చే సీట్లివే!